
భద్రాచలం, వెలుగు: చత్తీస్గడ్ లో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి ఆదివాసీ మహిళ కాలు నుజ్జునుజ్జు అయింది. బీజాపూర్జిల్లా బోడ్గా గ్రామానికి చెందిన సరస్వతి ఓయం శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇంద్రావతి నది వెంట విప్ప చెట్ల కింద పువ్వులను ఏరుకుని ఇంటికి వెళ్తోంది. రోడ్డు కింద మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుకు ఆమె కాలు తాకింది. ఒక్కసారిగా పేలడంతో ఆమె ఎడమ కాలు పాదం వరకు తెగిపోయింది. కుడి కాలుకు కూడా గాయాలయ్యాయి. వెంటనే బాధితురాలిని చికిత్స కోసం బైరంగడ్ ఆస్పత్రికి తరలించారు.